అగ్నిపథ్ పథకం ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి దేశం కోసం సేవ చేసే ఎంతో మంది ఆర్మీ ప్రేమికుల నిరుద్యోగులకు నిలువునా మోసం చేసి దేశ రక్షణ విషయంలో రాజీ పడటం సిగ్గు చేటు అని అగ్నిపథ్ ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీగా వచ్చి బాలాజీ సర్కిల్ నందు నిరసన చేపట్టారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీస్ బేరర్స్ రవి, ఉరుకుందు, ప్రసన్న, నాగరాజు మాట్లాడుతూ దేశంలో దేశభక్తితో సేవ చేసే రక్షణ రంగంలో కాంట్రాక్టు ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని అనడం దారుణం అని వారు వాపోయారు. ఇప్పటికే దాదాపు గత10 సంవత్సరాల నుంచి 11లక్షల ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయకుండా ఆర్ధిక కోణంతో ఆర్మీ ను చూడటం దుర్మార్గపు చర్య అని వారు అన్నారు. అగ్నిపథ్ వల్ల 4 సంవత్సరాల సర్వీస్ అయిపోయాక వారు ఏం చేయాలో దిక్కు తోచక ఆందోళన చెందాల్సిన పరిస్తితి ఏర్పదుతుందని కావున వెంటనే అగ్నిపథ్ ను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్మీ ఉద్యోగాలు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి ఆశయాలను తుంగలో తొక్కి వారు ఉవ్వెత్తున ఎగిసిపడుతున సందర్భంలో వారిపై పోలీస్ లు కాల్పులు, లాఠీలు ఉపయోగించి ప్రాణాలు తీయడం మాని వెంటనే న్యాయమైన డిమాండ్లను పరిస్కారం చూపాలని లేని పక్షంలో భవిష్యత్ లో మరింతగా ఉద్యమాలు ఉదృతంగా చేస్తామని వారు అన్నారు.