సాధారణ బదిలీల లో భాగంగా కృష్ణా జిల్లా నుండి కర్నూలు జిల్లాకు బదిలీపై వెళ్తున్న శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారికి ఈరోజు పోలీస్ పెరేడ్ మైదానంలో వీడ్కోలు పెరేడ్ నిర్వహించారు. ఈ పేరెడ్కు ఎస్పీ దంపతులు హాజరై, ముందుగా పెరేడ్ కమాండర్ ఆర్ఐ శ్రీనివాస్ గారి దగ్గరినుండి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ఎస్పీ దంపతులు , పెరెడ్ కమాండర్ తో పాటు పెరేడ్ వీక్షణకు బయలుదేరి, ప్లెటున్లను పరిశీలించారు. ఐతే ఈ బదిలీల ప్రక్రియ రాష్ట్రమంతటా ప్రతి జిల్లాలోనూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈయన సేవలు కృష్ణ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడ్డాయని జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ వారు హర్షం వ్యక్తపరుస్తున్నారు అలానే, ఈయన జిల్లాని, ఇక్కడి పోలీస్ వారిని విడిచిపెట్టి వెళ్తున్నందుకు కొంతమంది పోలీస్ సిబ్బంది తమ భాధను వ్యక్త పరిచారు.