అనంతపురం నగరంలో పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగలించిన నిందితుడిని స్థానిక టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 6 లక్షల విలువ చేసే 10 బైకులు స్వాధీనం చేసుకున్నారు. తాగుడు, తదితర జల్సాలకు అలవాటు పడి చిన్న వయస్సులోనే దొంగలుగా మారారు. అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తప్పుడు దారిలో డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వారు ఎప్పటికైనా న్యాయస్థానానికి చిక్కక తప్పదు. ఆ క్షణం వచ్చినప్పుడు వారి పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది కాబట్టి కస్టపడి, నీతిగా బ్రతకటానికి ప్రయత్నం చెయ్యండి అని హితవు పలికారు.