రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి అంటే నమ్మక తప్పదు. ప్రభుత్వంపై వ్యతిరేకత కొంత ఉన్నా , దానిని ప్రతిపక్షాలు వారికీ అనుకూలంగా మార్చుకోవాలని చూస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులూ వర్ల రామయ్య మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి గారూ! సామాజిక న్యాయమ్, సంక్షేమంపై బహిరంగ చర్చకు చంద్రబాబు గారు సవాల్ విసిరారు.దానికి మీరు సిద్దమైతే,వేదిక ఏర్పాటు చేయండీ, తేదీ, సమయమ్ తెలియజేయండి.మా పార్టీ తరఫున ఇద్దరo వస్తాము, మీ తరఫున ఇద్దరు మంత్రులను పంపండి.న్యాయ నిర్ణేతలుగా ఇద్దరు విశ్రాంత ఐ ఏ యెస్ లు. మీరు సిద్దమా? అని సవాల్ విసిరారు.