ఆర్మీలో ప్రవేశపెట్టనున్న ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే దేశ మంతటా ఎన్నో అల్లర్లు జరుగుతున్నాయి. అలానే భారీగానే ఆస్తి నష్టం కూడా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో, శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ వారు ప్రతి జిల్లాలో పహారా కాస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణ జిల్లా పోలీస్ వారు , రైల్వే స్టేషన్ల తో పాటు పలు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసారు . టికెట్లు ఉన్నవారినే స్టేషన్లోకి అనుమతి ఇస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తోన్న పోలీసులు.