ముందస్తు ఎన్నికలు వ్యూహంలో భాగంగా పొలిటికల్ మైండ్ గేమ్క తెరలేపారు దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మండే ఎండ మాకో లెక్కకాదు. వర్షానికి ఖాతర్చేయం అంటూ ఎక్కిన గుమ్మం దిగిన గుమ్మంలో తెగ హడాహుడి చేస్తున్నారు.
ఇప్పటికే అధికార వైఎస్సార్ పార్టీ గడప గడపకు అంటూ ప్రతీ గడప గడప ఎక్కుతుంటే తామేమి తక్కువ తినలేదని బీజీపీ గృహసంపర్క్ పేరుతో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టింది. ఇక పోతే తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రంగంలోకి దిగార. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లా, ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా బుధవారం నుండి ఉత్తరాంధ్ర పర్యటనతో చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ స్ఫూర్తి , చంద్రన్న భరోసా అన్న నినాదాన్ని శ్రీకారం చుట్టారు.
ఇక పోతే వామపక్ష పార్టీలు సైతం తమ ఉణికిని కాపాడుకునేందుకు ఇంటింట సర్వే పేరుతో పెరుగుతున్న ధరలు సమస్యలపై ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక మిగిలింది జనసేన పార్టీ మాత్రం ప్రస్తుతానికి నిశ్శబ్ధాన్ని పాటిస్తుంది.
ఇలా ఒకొక్క పార్టీ ఒక్కో స్టైల్ను ప్రదర్శిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రజలు మాత్రం వీరు వెళితే వారు. వారు వెళితే వీరు అంటూ ఇదెక్కడ గోలరాబాబు అంటూ అని విసుగు చెందుతున్నారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదుగానీ, ప్రస్తుతం మాత్రం ఎన్నికల వాతావరణం జోరందుకుంది. అధికార వైఎస్సార్ పార్టీకి ప్రతిపక్షమైన టీడీపీకి ఈ రాబోయే ఎన్నికలు చావో రేవో అన్న చందంగా మారింది.
ఒక వైపు సీఎం జగన్ మళ్లీ గెలుపు మనదే అన్న ధీమా బయటకు వ్యక్తం చేస్తున్నప్పటికీ లోపల మాత్రం మాజీ మంత్రులు, మంత్రిపదవులు రాని ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఆశించి భంగపడ్డ సీనియర్లు ఎన్నికల్లో రెబల్స్ మారతారన్న భయం ఉన్నట్లు ఆ పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయ. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే కేవలం చంద్రబాబు నాయుడు చరిష్మామీదే ఆ పార్టీ గెలుపు ఆధారపడి ఉందనేది చెప్పకతప్పదు.
మహానాడు జోష్తో రాష్ట్ర ప్రజలు మార్పు కన్పించిందని ప్రజల చూపు తెలుగుదేశం పార్టీ వైపు ఉందని ఆ పార్టీ నాయకులు గంపెడు ఆశతో ఉన్నారు. తెదేపా అధినేత కుమారుడు లోకేష్కు రాజకీయ పరిజ్ఞానం తక్కువగా ఉండడం ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని మరింత జోరు పెంచాలని ఆ పార్టీ పక్కాస్కెట్తో దూసుకుపోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే జనసేన , తెదేపా జతకడితే అధికార పార్టీ వైఎస్సార్కు ముచ్చెమటలు పట్టక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ రాబోయే ఎన్నికల్లో ధన ప్రవాహం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఊహిస్తున్నారు. ఈ విషయంలో అధికార పార్టీతో తెదేపా కాస్త వెనుకుబడే ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ప్రజలకు అలవాటు చేసిన పార్టీలు అందుకు తగిన విధంగా రంగం సిద్ధం చేసుకోవాలి. ఏది ఏమైనా ఈ రాబోయే ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ఖరీదైన ఎన్నికలు కానున్నాయని నిపుణుల విశ్లేషిస్తున్నారు.