అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో నియోజకవర్గ స్థాయి ప్లినరి సమావేశాలు నిర్వహిస్తున్నామని చోడవరం శాసన సభ్యులు&అనకాపల్లి జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ కరణం ధర్మశ్రీ తెలిపారు.
వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశానికి గౌరవ శాసనసభ్యులు తో పాటు, నియోజకవర్గం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, మండల వైయస్సార్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, వార్డ్ కమిటీ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, మరియు వాలంటీర్లు, విధిగా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
ఈ ప్లీనరీ సమావేశాలలో కొత్తగా నియామకమైన టువంటి, గ్రామ వైఎస్ఆర్సిపి కమిటీలు, మండల కమిటీ సభ్యులు, అందరూ కూడా ఏ ఏ బాధ్యతలు ఎలా నిర్వహించాలి, రాష్ట్ర స్థాయిలో జరిగే ప్లీనరీ సమావేశాల తర్వాత బాధ్యత పగ్గాలు చేపట్టి భవిష్యత్తులో సార్వత్రిక ఎన్నికలతో పాటు గ్రామస్థాయిలో, పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేయాలో, ఈ ప్లినరి సమావేశాలలో చర్చించడం జరుగుతుందన్నారు.
అలాగే ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ ప్లినరి సమావేశాలలో, ఆ నియోజకవర్గానికి సంబంధించి నటువంటి, వైఎస్ఆర్ సీపీ శ్రేణులు, జగనన్న కుటుంబ సభ్యులు, అందరూ విధిగా హాజరై విజయవంతం చేయాలని చోడవరం శాసన సభ్యులు &అనకాపల్లి జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ కరణ ధర్మశ్రీ కోరారు.
అలాగే ఈ ప్లినరి సమావేశాలకు, ముఖ్యఅతిథిగా, గౌరవ మంత్రులు, హాజరవుతున్నారు కాబట్టి, నియోజకవర్గ స్థాయి పార్టీ బలోపేతం కోసం, మరియు ఈ ప్లినరి సమావేశాలలో అందరు పాల్గొని, సహకరించాలని, అనకాపల్లి జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు కరణం ధర్మశ్రీ కోరారు.