అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను విచారించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. రైల్వేతో పాటు ప్రజా ఆస్తులకు జరిగిన నష్టాలను విచారించాలని పిటిషన్ లో పిటిషనర్ కోరారు. ఈ పథకం వల్ల జాతీయ భద్రత, సైన్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశీలించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
దేశ త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. పలు రైళ్లను తగులబెట్టారు.