పంజాబ్ లో మరో పరువు హత్య కలకలం రేపింది. తార్న్ తారన్ సాహిబ్‌లో రోహిత్ అనే వ్యక్తి తన చెల్లెలు స్నేహను హత్య చేశాడు. స్నేహ తను ప్రేమించిన రాజన్ జోషిని వివాహమాడింది. అయితే ఈ పెళ్లి స్నేహ కుటుంబీకులకు ఇష్టం లేదు. తన చెల్లిపై పగ పెంచుకున్న రోహిత్ తన స్నేహితుడి సాయంతో చెల్లిని హత్య చేశాడు. స్థానిక ఎస్సై బల్జిందర్ సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.