దేశంలో రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అవ్వడంతో నాయకులు నామినేషన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాలు ప్రతిపాదించిన తన పేరును ఉపసంహ రించుకుంటున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా వెల్లడించారు. తాను మరికొన్ని రోజుల పాటు జమ్ము కశ్మీర్ రాజకీయాల్లో ఉంటానని పేర్కొన్నారు.