అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం డెలావర్‌లోని తన నివాసం సమీపంలో సరదాగా సైకిల్ తొక్కారు. అయితే చివర్లో ఆయన కిందపడిపోవడంతో అంతా ఆందోళన చెందారు. సెక్యూరిటీ సిబ్బంది ఆయనను చేరుకుని, పైకి లేవనెత్తారు. ఆయన కాలు సైకిల్ పెడల్‌లో ఇరుక్కుపోవడంతోనే పడిపోయారు. అయితే తాను బాగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన ప్రకటన విడుదల చేశారు. 79 ఏళ్ల బైడెన్ జూన్ 17న తన 45 వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.