అవినీతి క్యాన్సర్‌తో సమానమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. శనివారం సీపీసీ గ్రూప్ స్టడీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా అధికారుల్లో అవినీతి ఉందని, ఏ అధికారైనా అవినీతి చేయకుండా స్వీయ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. అధికారులకు అవినీతి గురించి ఆలోచన కూడా రాకూడదని కమ్యూనిస్టు నాయకులకు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై 2012 నుంచి ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా అధికారులకు చైనాలో ఉద్వాసన పలికారు.