ఏపీలోని నర్సీపట్నంలో ఆదివారం తెల్లవారుజామున హైటెన్షన్ ఏర్పడింది. టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన ఇంటి గోడను అక్రమ నిర్మాణం పేరుతో కూల్చేశారు. మరోవైపు ఆయన అనుచరులను కూడా అరెస్టు చేస్తున్నారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఇటీవల చోడవరంలో జరిగిన మినీ మహానాడులో సీఎం జగన్, మంత్రులపై అయ్యన్న పరుష పదజాలం ఉపయోగించారు. ఆ కారణంగానే అయ్యన్నను అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.