పిల్లలందరి జీవితంలో తల్లికి ఎంత ప్రాముఖ్యత ఉందో తండ్రికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. తల్లి జన్మనిస్తే, తండ్రి తన పిల్లల్ని కాపాడడానికి, తన పిల్లల కనే ప్రతి కలని నెరవేర్చడానికి జీవితాంతం కష్టపడతాడు. నాన్న ఎన్ని త్యాగాలు చేసైనా సరే. తన పిల్లల ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటాడు. నాన్న ఎన్ని త్యాగాలు చేసినా సమాజంలో పిల్లలపై తల్లికి ఉన్న ప్రాముఖ్యత ప్రాధాన్యత. విషయంలో నాన్న కొంచెం వెనుకబడ్డాడేమో. అయితే తండ్రి నిస్వార్థ ప్రేమను గౌరవించటానికి ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం నాడు ఫాదర్స్ డే గా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 19వ తేదీ ఆదివారం రోజున వచ్చింది. ఈ సందర్భంగా ఫాదర్స్ డే చరిత్ర గురించి తెలుసుకుందాం.
ఫాదర్స్ డే ఎలా మొదలైందంటే.
సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ పితృదినోత్సవాన్ని ప్రారంభించింది. ఆమెకు తల్లి లేదు. దీంతో సోనోరా స్మార్ట్ డాడ్ జీవితంలో తల్లి, తండ్రి అన్నీ తానై నాన్న పెంచాడు. తన తండ్రికి తన పట్ల ఉన్న నిస్వార్థ ప్రేమ. అంకితభావాన్ని చూసి. డాడ్ తన తండ్రిని గౌరవిస్తూ. ఒకరోజు ప్రత్యేకంగా ఎందుకు ఉండకూడదని భావించింది. దీంతో తండ్రి గొప్పదనం చెబుతూ. గుర్తింపుకి ఒక రోజు ఉండాలంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతి రూపంగా 1910లో అమెరికాలో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు.