పలమనేరు పట్టణంలోని గాంధీనగర్ 33 నెంబరు చౌక దుకాణానికి శివకుమార్ డీలర్ గా ఉన్నాడు. కొన్నాళ్లుగా తమకు నిత్యావసర సరుకులు అందడం లేదని సంచార వాహనం వద్దకు వెళ్లి అడిగిన ఇవ్వలేదని పలువురు కార్డుదారులు స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
విచారణ జరిపిన అధికారులు సంబంధిత చౌక దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, బ్యాలెన్స్ వివరాలు పరిశీలించారు. ఏడు టన్నుల బియ్యం, రెండు క్వింటాళ్ల చక్కెర మాయమైనట్లు గుర్తించారు. స్పందించిన అధికారులు లోతుగా విచారించగా డీలర్ శివకుమార్ తో పాటు ఇంటి వద్ద వాహన ఆపరేటర్ లొకేషన్ ఈ అక్రమాలకు పాల్పడినట్టు తేల్చారు. దీనిపై 6ఏ కేసు నమోదు చేశారు, చౌక దుకాణాలను సీజ్ చేశారు.