ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా గుడివాడ ఫ్లైఓవర్ నిర్మాణం ఆగదు! మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి స్పష్టమైన హామీ ఇచ్చిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ. కృష్ణాజిల్లా మచిలీపట్టణం పార్లమెంట్ లోని గుడివాడ నియోజకవర్గంలో అతి త్వరలో నిర్మించబోతున్న రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి అంటూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ పురందేశ్వరి కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ కి లేఖ వ్రాసిన దృష్ట్యా మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి శనివారం రాత్రి నితిన్ గడ్కరీ తో వారి కార్యాలయములో సమావేశమయ్యారు.
ఎన్నో ఏళ్లుగా గుడివాడ ప్రజలు ప్రతి రోజూ కనీసం 50 సార్లు భీమవరం గేటు, కనీసం 30 సార్లు మచిలీపట్నం గేటు ఇలా ప్రతి అరగంట కొకసారి రైల్వే గేట్లు పడుతుండటంతో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులు, చిన్న స్థాయి వ్యాపారులు, పొరుగూరు కు వెళ్లే ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో ఆయనకు వివరించారు. అంతేకాక ఈ నిర్మాణం ఎక్కడ చేబడుతున్నారు, వీటి వలన ఎంతమందికి లభ్ది చేకూరుతుంది అన్నవిషయాలను గుడివాడ లో రెండు రైల్వే గేట్ల మీద సుమారుగా 2. 75 కి. మీ. పొడవునా ఒక మంచి బ్రిడ్జి నిర్మాణం కాబో తున్నదని స్వయంగా మ్యాప్ ద్వారా మంత్రి కి ఎం పి బాలశౌరి వివరించారు.
కేవలం కొద్ది మంది వ్యాపారస్తులకు నష్టం వాటిల్లుతుంది అని ఇన్నివేలమందికి ఉపయోగపడే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చూడాలని , వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించే టట్లు ఉత్తర్వులు ఇవ్వాలని ఎంపీ బాలశౌరి కోరగా సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రివర్యులు వీటి నిర్మాణపనులు అతి త్వరలోనే ప్రారంభిస్తామని ప్రజలకు ఉపయోగపడే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితులలో నిలిపే ప్రసక్తి లేదు అని కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ ఎంపీ బాలశౌరికి స్పష్టం చేశారు. తన అభ్యర్ధనమేరకు తక్షణమే స్పందించి గుడివాడ ఆర్ వో బి ల నిర్మాణానికి స్పష్టమైన హామీని ఇచ్చినందుకు గుడివాడ ప్రజల తరపున మరియు నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసానని, త్వరితగతిన ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తిచేసి తమ చేతులమీదనే వీటిని ప్రారంభించాలని కోరినట్లు మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఈ విషయంలో పూర్తి సహకారాన్ని అందిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి కి ఎం పి బాలశౌరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.