పాములపాడు మండలం లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. శనివారం పగటి వేళలో ఉష్ణోగ్రతలు కాస్త అధికంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత రాత్రి ఉన్నట్లుండి ఆకాశం మేఘావృతమై 32. 3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంట పొలాల్లో వర్షపు నీరు పంట కు ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉంటే మండలంలో పదునైన వర్షాలు కురవడం వల్ల మరికొంతమంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.