మహానంది క్షేత్రం శనివారం భక్తులతో కళకళలాడింది. వీకెండ్ కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ముందుగా భక్తులు కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీకామేశ్వరి దేవి సహిత మహానందీశ్వరస్వామివార్లను దర్శించుకున్నారు. వేకువజాము నుంచి ప్రారంభమైన స్వామిఅమ్మవార్ల దర్శనం రాత్రి వరకు నిర్విరామంగా కొనసాగింది.