ఆర్మీలో ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశంలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో ముందస్తు భద్రతా చర్యలో భాగంగా ఆదోని రైల్వే స్టేషన్లోనూ అధికారులు భద్రతను పెంచారు. ఆదోని రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులతోపాటు ఒక ఎస్, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఐదు మంది పోలీసు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది, ఏఎస్‌ఐతోపాటు ఇద్దరు కానిస్టేబళ్లు, ఒక మహిళా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదోని రైల్వే స్టేషన్ ఎస్ఐ సుబ్బారాయుడు శనివారం విలేకరులకు తెలిపారు.