బండి ఆత్మకూరు మండలంలోని కడమల కాల్వ గ్రామంలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు నరసింహుడు గుడిసె మొత్తం కాలిపోయి బూడిదైంది. ఆ ఇంటిలోని వారు పనుల నిమిత్తం వలస వెళ్ళడం వలన ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఆ పేద కుటుంబానికి ఉన్న ఏకైక ఆధారమైన ఇల్లు కాలిపోయి ఆ కుటుంబం నిలువ నీడ లేక రోడ్డున పడింది. ఇంటిలోని సామగ్రి మొత్తం కాలిపోయింది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa