పంటల బీమా వర్తించని రైతుల కోసం ఆది, సోమ, మంగళ వారాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తాడిపత్రి మండల వ్యవసాయ అధికారిణి మహితా కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ -క్రాప్ బుకింగ్ జాబితాలో పేరు ఉండి ఈ కేవై సి చేసుకొని బీమా జాబితా లో పేర్లు లేని రైతులు ఆది, సోమ, మంగళ వారాల్లో 9. 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వ హించే ప్రత్యేక గ్రీవెన్స్ దరఖాస్తు చేసుకోవచ్చు నన్నారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం స్థానిక మండల తహశీల్దారు కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు ఏ ఓ చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.