అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. 67వ జాతీయ రహదారిపై డోనేకల్లు వాగు ఉదృతంగా ప్రవహిస్తుడడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్. కొట్టాల వాగు రావడంతో 3 కిలోమీటర్లు మేర వాహన రాకపోకలు నిలచిపోయాయి. గుంతకల్లు - బళ్లారి, విడపనకల్లు - గుంతకల్లు పోవు బస్సులు, లారీలు ఎక్కడికక్కడే నిలచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బూదగవి చెరువు నిండి మరువ పారుతోంది.