తెలుగుదేశం పార్టీపై అభిమానం ఉన్న ప్రతి యువతీ యువకులు అందరికి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కల్పించాలని మండల కన్వీనర్ గోనుగుంట్ల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. బత్తలపల్లి మండలంలోని మాల్యవంతం గ్రామం నుండి ధర్మవరం టీడీపీ ఇంచార్జ్, టిడిపి అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, కాకర్ల సురేంద్ర నాయుడు, సంఘాల సూరి, గంటాపురం జగ్గు, చల్లా శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటిలోనూ టిడిపి సానుభూతిపరులును గుర్తించి పార్టీలో సభ్యత్వం కల్పించేలా చూడాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధి కొరకు కష్టపడి పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండలం కన్వీనర్ నారాయణరెడ్డి, కాకర్లసురేంద్ర, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు చల్లా శ్రీనివాసులు, తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గంటాపురం జగ్గు, నెటెం రమణ, సంగాల సూరి, హరి, పవన్, బాల అంజినేయులు మండలం ఐటీడీపి బాద్యులు డేరంగులు హరిప్రసాద్, డేరంగుల రాజా, జొన్నగడ్డ విజయ్, టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధికార ప్రతినిది డేరంగుల ప్రతాప్ ధర్మవరం నియోజకవర్గం అధ్యక్షడు ఐటీడీపి మందల సురేష్ బాబు సి ఐ ఎన్ రామకృష్ణ హిందూపురం పార్లమెంట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తోట. వాసుదేవ, బాబా, ఆనందరెడ్డి, నాగేంద్ర, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.