రైల్వేకోడూరు లోని సోడిశెట్టి నగర్లో నివాసం ఉంటున్న హరిత(36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సీఐ విశ్వనాథరెడ్డి కథనం మేరకు కుమారునితో కలిసి గణేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందని అన్నారు. కుమారుడు ఇంట్లో లేని సమయంలో ఇద్దరూ గొడవ పడ్డారని, ఇంటికి వచ్చేసరికి అనుమానాస్పదంగా పడి ఉన్న తల్లిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.