ముడి కూరగాయలను ఉడికిచ్చి లేదా అలాగే తినడం మంచిదే కానీ ఖాళీ కడుపుతో మాత్రం తినొద్దని నిపుణులు తెలుపుతున్నారు. అది జీర్ణవ్యవస్థమీద అదనపు భారాన్ని మోపుతుందని, ఏదైనా తిన్న తర్వాత కొద్దిసేపటికి వాటిని తింటే బావుంటుందని చెబుతున్నారు. రాత్రి నానబెట్టుకున్న ఎండు ద్రాక్షలు, బాదం, ఇతర గింజ పదార్థాలు ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటి వల్ల శరీరానికి ప్రోటీన్స్ అందుతాయి.