మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన యువ రైతు పెట్టుకున్న లోన్ దరఖాస్తు చూసి బ్యాంకు అధికారులు ఆశ్చర్యపోయారు. సోయాబీన్ సాగు చేస్తే లాభాలు రాలేదని, రూ.6.6 కోట్లిస్తే హెలికాప్టర్ కొనుక్కుని అద్దెకు తిప్పుతానని కైలాష్ పతంగే శనివారం కోరాడు. రైతులు కూడా పెద్ద కలలు కంటారని, వాటిని నెరవేర్చుకునేందుకు సహకరించాలని బ్యాంకు అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు.