'అగ్నిపథ్' పథకంలో చేపట్టే నియామకాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఆదివారం వివరాలతో కూడిన సమాచారాన్ని విడుదల చేసింది. ఆన్లైన్ పరీక్షలు, క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు ఉంటాయని తెలిపింది. అభ్యర్థుల గరిష్ట వయసు 21 ఏళ్లని, నాలుగేళ్లు పని చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఏడాదికి 30 రోజులు సెలవులు ఉంటాయని పేర్కొంది.