దేశంలో రోజువారీ కరోనా కేసుల ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 12,899 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 15 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి తాజాగా 8,518 మంది కోలుకున్నారు. మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 72,474కు చేరింది.