చిత్తూరు: బుచ్చినాయుడు కండ్రిగలో కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యవసర సరుకులు, పెట్రో వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మండల సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో పర్యటించి ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని బాల గురవయ్య తెలిపారు.