నీరజ్ చోప్రా ఈ పేరు దేశమంతా సుపరిచితమే. ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణ పతకం అందించిన క్రీడాకారుడు నీరజ్. జావలిన్ త్రో విభాగంలో తన సత్తా చాటాడు.రికార్డ్ త్రో చేసి గోల్డ్ గెలిచాడు. అతడి ప్రతిభకు భారత ప్రభుత్వం అతడిని సన్మానించింది. అయితే తాజాగా ఫిన్‌ల్యాండ్‌లో జరుగుతున్న కౌర్టేన్ గేమ్స్‌లో నీరజ్ పోటీ చేస్తున్నాడు. ఇందులో కూడా నీరజ్ తనదైన ప్రతిభతో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే ఈ ఏడాది 2022లో నీరజ్ సాధించిన తొలి స్వర్ణం ఇదే కావడం విశేషం. ఈ ఈవెంట్‌లో చోప్రా 86.69 మీటర్ల త్రో చేసి స్వర్ణం అందుకున్నాడు. అయితే గత వారం జరిగిన పావో నుర్మి పోటీల్లో నీరజ్ సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు. కానీ ఈ పోటీల్లో 89.30 మీటర్ల త్రో చేసి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు.