ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్‌చోప్రాకు పెను ప్రమాదం తప్పింది. ఫిన్లాండ్లో జరుగుతున్న కూర్తానె గేమ్స్‌లో శనివారం ఆయన స్వర్ణం సాధించాడు. అయితే జావెలిన్ విసిరే క్రమంలో పట్టుతప్పి పడిపోయాడు. భుజానికి గాయమైందేమోనని అంతా భయపడ్డారు. అయితే తనకేమీ కాలేదని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు.