యానాంకు చెడ్డపేరు తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్న పేకాట కేంద్రాలను తొలగించేవరకు తన పోరాటం ఆగదని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ మధ్యే లక్కీగా పదవిలోకి వచ్చిన వ్యక్తి ఢీల్లీ, పుదుచ్చేరి స్థాయిలో చేసిన ప్రయత్నాలవల్ల యానాంలో పేకాట క్లబ్ వచ్చిన విషయం అందరికీ తెలుసన్నారు. పేకాట, గ్యాంబ్లింగ్ నడుస్తున్నందువల్లే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఏపీల నుంచి కార్లలో వస్తున్నారని. యానాంకు క్యారమ్స్, టీటీ ఆడటానికి అంతదూరాల నుంచి ఆటగాళ్లురారని మల్లాడి అన్నారు. అధికారులు రిక్రియేషన్ సెంటర్ కు రెండేళ్లు ఎందుకు అనుమతిచ్చారని ప్రశ్నించారు.