కాకినాడ జిల్లా లో చికెన్ ధర కొండెక్కింది. ఏకంగా కేజీ చికెన్ ధర ట్రిబుల్ సెంచరీ కొట్టింది. కొన్ని వారాల వ్యవదిలోనే చికెన్ ధర 300 దాటడం గమనార్హం. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కోడి మాంసం ధరలు పెరిగిపోవడంతో మాంసాహార ప్రియులు లోబదిబోమంటున్నారు. నగరంలో గత నెలలో కేజీ చికెన్ ధర 200 రూపాయలుగా ఉంది. అయితే ఇప్పుడు కాకినాడలో ఇప్పుడు కిలో చికెన్, ధర 300 రూపాయలకు చేరుకుంది. దీంతో చికెన్ ధరలు ఒక్క సారిగా పెరిగిపోవడంతో మాంసాహార ప్రియులే కాదు వ్యాపారం లేక వ్యాపారులు తీవ్ర నిరుత్సాహం చెందుతున్నారు. ఇకపోతే గత మూడు నెలల కాలంలో ఫౌల్ట్రీ రైతులు ఎక్కువగా బ్రాయిలర్ కోళ్లను పెంచేందుకు సాహసించలేదు. దీంతో జిల్లా లో బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో మార్కెట్‌లో చికెన్ డిమాండ్‌కి తగ్గ కోళ్ల ఉత్పత్తి లేకపోవడంతో చికెన్ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి.