చిన్నతనంలో ప్రధాని మోడీ సాహసోపేత చర్యను తమిళనాడులోని ఓ పాఠశాల ఒకటో తరగతిలో పాఠ్యాంశంగా చేర్చింది. తాను బాల్యంలో కొలనులో మొసలి కనిపించగానే, ఇంటికి పట్టుకెళ్లానని మోడీ 2019లో ఓ సందర్భంలో చెప్పారు. తల్లి తిట్టడంతో దానిని వదిలేసినట్లు వెల్లడించారు. దీనినే పాఠ్యాంశంలో చేర్చి, ఆయన ధైర్య సాహసాలను పిల్లలకు బోధిస్తున్నారు.