అత్త ఆడబిడ్డలు కలిసి తనను హింసిస్తున్నారని బుర్రిపాలేనికి చెందిన ప్రసన్న ఆదివారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్తిలో వాటా వివాదం కారణంగా అత్త మరియమ్మ, ఆడబిడ్డలు కలిసి తనపై దాడికి దిగుతూ అసభ్యంగా మాట్లాడుతున్నారని గతంలో కూడా ఇదే విధంగా జరిగిందని తనకు తక్షణ న్యాయం చేయాలని కోరుతూ రూరల్ పోలీసులను ఆశ్రయించింది.