పిడుగురాళ్ళ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి లో సాగునీటి చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చిన్న నీటి పారుదల శాఖ అధికారులు ఆదివారం మట్టి తవ్వకాలను అడ్డుకున్నా. వారు వెళ్ళిన తరువాత మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అక్రమాల వలన సాగునీటి చెరువుకు గండి పడుతుందని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.