జిల్లాల పునర్విభజన జరిగిన దగ్గర నుండి ప్రతి జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉందేందుకు పోలీస్ వారు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. పేకాట స్థావరాలు, నాటు సారా ద్వాంసం, లాంటివే కాకుండా తాజాగా పాత నేరస్తుల్ని పిలిచి , వారి జీవన విధానం ఎలా ఉందొ తెలుసుకుంటున్నారు. అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సి.ఐ రాము & పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.నేరాల జోలికెళ్లకుండా బుద్ధిగా జీవించాలని సూచించారు.నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడ నేరాలకు పాల్పడిన ఈ సారి తీసుకునే చర్యల వలన పూర్తిగా మీ జీవితాలు నాశనం ఇయ్యి ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో నడుచుకోవాలని హితవు పలికారు.