అగ్నిపథ్ కు వ్యతిరేకంగా విపక్షాలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చెరుకుపల్లి ఎస్ఐ డి వెంకట కొండారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తు పటిష్టం చేశారు. చెరుకుపల్లి ఐలాండ్ సెంటర్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ చేశారు. ఎవరైనా బంద్ పేరుతో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.