కర్నాటక రాష్ట్రంలో రెండురోజులపాటు కురిసిన భారీ వర్షాలకు పెన్నానది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. దీంతో కొట్నూరు చెరువుకు వరదనీరు వస్తున్నది. ఈ తరుణంలో పట్టణంలోని హస్నాబాద్ వద్ద కట్టకాలువ తెగిపోయి ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయి నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని హస్నాబాద్ కు చెందిన ప్రజలు వాపోయారు.