కౌలు రైతుల భరోసా యాత్ర పేరిట జనసేనాని పవన్ కల్యాణ్ పర్చూరు పర్యటనకు వచ్చిన సమయంలోనే ఆ నియోజకవర్గంలోని వంకాయలపాడులో కౌలు రైతు దంపతులు ఆత్మహత్యా ప్రయత్నం చేయగా భర్త మృతి చెంది భార్య మృత్యువుతో పోరాడుతున్నప్పటికీ వారిని ఆయన పరామర్శించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఎక్కడెక్కడో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు పర్చూరు రప్పించిన పవన్ వంకాయలపాడును కూడా సందర్శించి ఉంటే బాగుండేదంటున్నారు.