చిత్తూరు: నిండ్ర మండలం ఆగరం దళితవాడకు చెందిన వెంకటేష్, ఉష దంపతుల తనయుడు నందకుమార్ (14) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఆదివారం నాడు వ్యవసాయం పంట పొలం వద్ద ఎద్దులు మేపుతూ ఉండగా ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎద్దులు మేస్తు ఉండగా దాన్ని గమనించిన నందకుమార్ తరమడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.