ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ అసత్య ఆరోపణలు నమ్మొద్దు - ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 02:17 PM

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్మాన్ పేటలో గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు, ప్రభుత్వ పని తీరు గురించి లబ్దిదారులతో అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. టీడీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు ఎవరూ నమ్మేస్థతిలో లేరన్నారు. ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మురళీ రెడ్డి తదితరులు ఉన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com