శ్రీశైలం నియోజకవర్గంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరించారు. బుక్‌లెట్‌లు పంపిణీ చేశారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు వారికి స్వాగతం పలికారు. గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మేళ్లను వివరించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో తాము పొందిన లబ్ధి గురించి తెలిపారు. ఈ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని గ్రామస్తులు చెబుతున్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కరివేన గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి మూడేళ్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఆరా తీసి, ఏయే పథకాలతో ఎంత లబ్ధి పొందారో వివరిస్తూ..సీఎం వైఎస్ జగన్ స్వతహాగా రాసిన లేఖను, నవరత్నాల బుక్‌లెట్‌ను అందించారు. ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ సహాయాన్ని తెలియ చేస్తూ, ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎమ్మెల్యే ముందుకు సాగారు. అర్హత ఉండి ఇంకా ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అర్హులకు సకాలంలో సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదేనని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే సందర్శిస్తున్న ప్రతీ గడపలో ప్రజలను పేరు పెట్టీ మరీ పలకరిస్తూ మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహర్ రెడ్డికి మీ దీవెనలు అందించాలని, మరో సారి ఆశీర్వదించి సీఎం గా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న మన అందరి పాలనకు మద్దతుగా ఫోన్ నంబర్ 8296082960 కి మిస్డ్ కాల్ చేయించి ప్రభుత్వ సంక్షేమ పాలనకు ప్రజల వద్ద నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టారు.