వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు , తన డ్రైవర్ సుబ్రమణ్యంని దారుణంగా చంపినా సంగతి తెలిసిందే. మొదట్లో ఈ విషయాన్నీ బయటికి రాకుండా చెయ్యాలి అని కొంతమంది ప్రభుత్వ పెద్దలు అనుకున్నప్పటికీ, మీడియా సహకారంతో ప్రతిపక్షాలు ఈ విషయాన్నీ వెలుగులోకి తీసుకువచ్చాయి. ఈ సందర్భంలో ఇతనిని అరెస్ట్ చెయ్యడం జరిగింది. కానీ ఇతనిని బయటికి తీసుకువచ్చేందుకు కొంతమంది నాయకులూ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులూ వార్ల రామయ్య మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి గారూ! దళిత యువకున్ని దారుణంగా హత్యచేసిన ఎమ్ఎల్సీ అనంతబాబును బెయిల్ పై బయటకు తీసుకొనిరావాలని మీ ప్రభుత్వo నానా తంటాలు పడుతున్నది. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన మీరు ఈ వర్గాలను విస్మరించి, అనంతబాబు వైపు మొగ్గడo దళిత వ్యతిరేక చర్యే. ఇప్పటికైనా దళితులకు న్యాయమ్ చేయండి అని విన్నవించుకున్నారు.