తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అహరహం శ్రమించే చంద్రబాబు నాయుడుని కంటికి రెప్పలా కాపాడుతున్న నారా భువనేశ్వరి మా అందరికీ మాతృసమానులు అని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ రోజు నారా భువనేశ్వరి పుట్టిన రోజు కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అమ్మా! మీకు దేవుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను అని తెలియజేసారు. అలానే, కొంతమంది టీడీపీ నాయకులూ సైతం ఈమెకు జన్మదిన శుభాకాంక్షలు తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేసారు. రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ అభిమానులు అన్నదానం, రక్తదానం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.