ఓ వీడియో విడుదల చేసిన బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారోనని ప్రశ్నించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అనుచరులు బహిరంగంగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియాను ట్విటర్ షేర్ చేశారు. ఇందులో ఓ భవనం ముందు కొంతమంది పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తున్నారు. వీళ్లు ఓవైసీ అనుచరులని విష్ణు వర్దన్ పేర్కొన్నారు. ఇలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జాతీయవాదం గురించి ప్రతి ఒక్కరికీ పాఠాలు చెబుతారు. కానీ ఇలాంటి వీడియోలు కనిపించినప్పుడు మాత్రం తమ దుర్మార్గపు రాజకీయాలను కొనసాగించడానికి వెంటనే దాక్కుంటారు’ అని ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.