బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండే పార్టీలతో కలసి జాతీయ స్థాయిలో ప్రత్యేక రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలని యోచిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తగ్గ వ్యూహాలను పదునుపెడుతున్నారు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కసరత్తు కొనసాగుతోంది. పక్కా వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. బీజేపీ రాజకీయలు.. వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. తన రాజకీయ ప్రయాణంలో కలిసొచ్చే పార్టీలు - ప్రముఖల తో కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు సైతం మద్దతు ప్రకటిస్తున్నారు. పార్టీ పేరు - రంగు - చిహ్నం విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రాధాన్యత పైన ఏ మాత్రం ప్రభావం పడకుండా వ్యవహరిస్తున్నారు.
అదే సమయంలో బీజేపీతో పోరాటం చేస్తూనే కాంగ్రెస్ తోనూ సమదూరం పాటిస్తున్నామనే సంకేతాలు స్పష్టం చేసే విషయంలో ఎక్కడా సందేహాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాతీయ పార్టీ ప్రకటన పైన కసరత్తు పూర్తయిన తరువాత.. తన కార్యాచరణలో భాగంగా తొలి దశలో యువత, రైతులకు సంబంధించిన అంశాలపై ఉద్యమాల దిశగా ఆలోచన చేస్తున్నారు.
ఇందులో కలిసొచ్చే పార్టీలు.. ప్రముఖులతో మంతనాలు కొనసాగిస్తున్నారు. జేడీఎస్..ఆర్జేడీ..ఆప్..జేఎంఎం వంటి పార్టీలు తమతో కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. జాతీయపార్టీ ఆలోచన వెనక కారణాలను శ్రేణులద్వారా గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లేలా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. నటుడు ప్రకాష్ రాజ్, తమిళ హీరో విజయ్ వంటి వారితోనూ కేసీఆర్ ఇప్పటికే చర్చలు చేసారు. బీజేపీ అమలు చేస్తున్న విధానాల కారణంగా దేశానికి జరిగే నష్టం పైన మరింత ప్రజలకు వివరించాలని కోరారు. భారతీయ రాష్ట్ర సమితి పేరు పైనా పలు మార్గాల్లో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. తన పార్టీ విధి విధానాలు.. అజెండా గురించి ఈ నెల 21 లేదా 22న జరిగే పార్టీ విస్తృత స్థాయి భేటీలో పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు.
యువత అసంతృప్తిగా ఉన్న అంశాలపై ప్రశాంత్‌కిషోర్ బృందం.. ఒక నివేదిక సమర్పించినట్లు సమాచారం. .దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa