అగ్నిపథ్ నిరసనలపై డేగా కన్ను వేసిన భద్రతా దళాలు నిరసనకారుల బంద్ నేపథ్యంలో జనాల రాకపోకలపై ఫోకస్ పెట్టారు. పలు చోట్ల మమ్మురంగా తనిఖీలు చేపట్టారు. ఇదిలావుంటే అగ్నిపథ్‌కు నిరసనగా సోమవారం సైనిక ఉద్యోగార్థులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందస్తు చర్యల్లో భాగంగా సరహౌల్ సరిహద్దు వద్ద అన్ని వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో యమున ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa