పోలీసు నిర్భంధంలోనూ వారి కళ్లుగప్పి టీడీపీ నాయకురాలు అనిత చలో కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం చేరుకొన్నారు. నర్సీపట్నంలో టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీగోడను అధికారులు కూల్చివేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఛలో నర్సీపట్నం చేపట్టింది. ఈ నేపథ్యంలో, అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ దీక్ష నిర్వహించారు. కాగ, ఈ దీక్షకు హాజరయ్యేందుకు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత పోలీసులను ఏమార్చి ముఖానికి ముసుగు ధరించి, ఓ స్కూటర్ పై నర్సీపట్నం చేరుకున్నారు.
దీనిపై ఆమె ట్వీట్ చేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వారి వలయాలను ఛేదించుకుని ఛలో నర్సీపట్నం దీక్షాస్థలికి చేరుకున్నట్టు వెల్లడించారు. చింతకాయల విజయ్ దీక్ష విరమింపజేసినట్టు తెలిపారు. ఈ మేరకు వీడియో పంచుకున్నారు. ఇదిలవుంటే ఈ ఉదయం ఓ మహిళా కానిస్టేబుల్ తన ఇంటి వద్ద కనిపించగా, నోటీసుల్లేకుండా తనను గృహ నిర్బంధం ఎలా చేస్తారంటూ అనిత ఆమెను తిప్పిపంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa