ట్రెండింగ్
Epaper    English    தமிழ்

24వ తేదీన ఏపీ కేబినేట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 02:01 AM

ఏపీ క్యాబినెట్ భేటీ తేదీల్లో స్వల్ప మార్పు చోటు చేసుకొంది. దీంతో ఈ నెల 22న సీఎం జగన్ అధ్యక్షతన జరగాల్సిన మంత్రివర్గ సమావేశం తేదీ మారింది. మంత్రిమండలి సమావేశాన్ని ఈ నెల 24కి వాయిదా వేసినట్టు సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. క్యాబినెట్ భేటీ వెలగపూడిలోని ఏపీ సచివాలయం ఆవరణలో ఉదయం 11 గంటలకు ఒకటో బ్లాక్ మొదటి అంతస్తులో జరుగుతుందని వివరించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ మార్పును అన్ని విభాగాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు గుర్తించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa